Author: parivarthanaawaaz

కొడుకు పుట్టలేదని 9 నెలల పాపతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్య పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 ,      మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో నివసిస్తున్న చెటుపల్లి శ్రవణ్, స్పందన(24) అనే దంపతుల వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరూ ఆడ పిల్లలే(3 ఏళ్లు, 9 నెలలు) పుట్టడంతో, గత కొంత కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన స్పందనమగ పిల్లవాడు జన్మించలేదని ఆవేదనతో, తన 9 నెలల పాపతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Read More

తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు. పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 మహబూబాబాద్     గార్ల మండలంలోని మర్రిగూడెం, సిరిపురం, నగరం, బాలాజీ తండా, సీతంపేట గ్రామాలలో శనివారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సర్వే చేసి తడిసిన మొక్కజొన్న పంటలను మరియు వరి పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు మొక్కజొన్న పంట తడిసి రైతులు నష్టపోయారు వెంటనే తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట చివరికి చేతికి అందకుండా అకాల వర్షాలకు నష్టపోయి రైతులు లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇటువంటి…

Read More

ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడలి అధికారుల సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 25 ,    శుక్రవారం కలెక్టర్ సమీకృత కార్యాలయం లోని సమావేశ మందిరంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, వ్యవసాయ, పౌరసరపర, శ్రీ సంక్షేమ, పారిశ్రామిక, ఎస్సీ ఎస్టీ బీసీ అభివృద్ధి శాఖల, గృహ నిర్మాణ, విద్యుత్, మున్సిపాలిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా…

Read More

మత్తుతో జీవితాలు చిత్తు : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23,  సుజాతనగర్ సెంటర్లో ” చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం” అనే ప్రోగ్రాంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్  పాల్గొన్నారు.చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు ,సుజాతనగర్ ఎస్సై రమాదేవి   మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఇట్టి ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,ధన్వంతర కాలేజ్ ,శ్రీ ఫార్మసి కాలేజ్ మరియు సుజాతనగర్ హైస్కూల్ కు చెందిన స్టూడెంట్స్,అదే విధంగా సుజాతనగర్ మండలానికి చెందిన రాజకీయ నాయకులు,మీడియా వారు మరియు ఇతర పబ్లిక్ మొత్తం దాదాపు 700 మంది పాల్గొన్నారు.డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ నెల 15వ తారీకు నుండి వచ్చే నెల 15వ తారీకు వరకు ప్రతిరోజు చేపట్టే చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా జనాలకు డ్రగ్స్ గురించి అవగాహన…

Read More

మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన  కలెక్టర్ జితేష్ వి. పాటిల్.  పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23,  బూర్గంపాడు మండలంలోనిమొరంపల్లి బంజార గ్రామంలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను  కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం మరియు మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణం సమీకృత వ్యవసాయం యొక్క ప్రాతినిధ్య మోడల్‌గా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి మండలంలో అమలు చేయాలన్న లక్ష్యంతో మొరంపల్లి బంజార గ్రామంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి…

Read More

పాల్వంచ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కూనంనేని పాల్వంచ రూరల్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 23: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో దంతేల బోర ,జగన్నాధ పురం, కేశవా పురం, బసవ తారక కాలనీ, సూరారం గ్రామాల లో రెండు కోట్ల 30 లక్షల అంచనా కలిగిన సిసి రోడ్ల కు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివ రావు మీడియా తో మాట్లాడుతూ పాల్వంచ మండలంలో.ప్రజలు 24 వేలకు పైగా మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించుటకు కృషిచేసిన అందరికీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం, కేంద్రం మరియు ఇంకా అనేక రకాల నిధులు తెచ్చి కొత్తగూడెం నియోజకవర్గం లో ప్రతి గ్రామానికి, పట్టణంలో ప్రతి వీధి, ప్రతి గల్లీకి. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య, తదితర సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా…

Read More

    జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా పరివర్తన ఆవాజ్.మహబూబాబాద్, అక్టోబర్.23 జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మరీనా పెయింట్ ప్రైవేటు లిమిటెడ్, కరీంనగర్, కంపెనీలో ఖాళీగా ఉన్న అడ్మిన్ మేనేజర్, అకౌంట్స్, టెలికాలర్, స్టోర్ ఇంచార్జ్, హెచ్.ఆర్.టీమ్, డేటా ఎంట్రీ, లీగల్ టీమ్, ఆఫీస్ సబార్డినెట్ తదితర పోస్టులకు అర్హత కల్గిన 18-35 వయసు గల స్త్రీ,పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు తేది: 25.10.2025 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్ధులు తేది: 25.10.2025 న ఉదయం 10.30 గం. ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జిల్లా కలెక్టరేట్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ తో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి…

Read More

జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య… వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 23 (పరివర్తన అవాజ్), వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన, ప్రదర్శనశాలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. అక్కడ ఉన్న శిలాశాసనాలు, విగ్రహాలు, శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, కాకతీయుల సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు వారసత్వాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎంపీ అన్నారు. జిల్లా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సంరక్షణా పనుల గురించి ఎంపీ ఆరా తీశారు. పురాతన శిల్పకళ, కాకతీయ శిలాశాసనాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని, వీటి సంరక్షణ కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు. జిల్లా పురావస్తు అధికారులు…

Read More

మీడియా ఐక్యతతో సమాజంలో న్యాయం నిలవాలి.. పాల్వంచ మీడియా సంఘం పిలుపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహణ  పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాస్  అక్టోబర్ 23 : పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు గుంట్రూ వేణు, సెక్రటరీ కుమ్మరి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా పాల్వంచ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చేరిన కొత్త సభ్యులకు పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు, దిశ దినపత్రిక విలేకరి జవ్వాజి మధు చేతుల మీదుగా కొత్త సభ్యులకు సభ్యత్వ ధృవపత్రాలు అందజేశారు.అనంతరం కొత్త సభ్యులను సంఘంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ మీడియా సమాజంలో నాలుగో స్థంభంగా…

Read More

టేకులపల్లి గ్రామపంచాయతీ లో కొమరం భీమ్ జయంతి వేడుకలు. టేకులపల్లి పరివర్తన అవాజ్  అక్టోబర్ 22, బుధవారం మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్.ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు, ముందుగా టేకులపల్లి సెంటర్ లో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గిరిజనుల అభివృద్ధి కొరకు కొమరం భీమ్ చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ.బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ అప్పారావు,బర్మావత్ శివకృష్ణ, లచ్చు నాయక్,చీమల రామకృష్ణ, మాజీ సర్పంచుల సంఘ అధ్యక్షుడు రాజేందర్, కరుణాకర్, మాజీ సర్పంచి లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ మండల మహిళఅధ్యక్షురాలు ఆమడ రేణుక, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More