Author: parivarthanaawaaz
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని. భద్రాద్రి కొత్త గూడెం పరివర్తన అవాజ్ డిసెంబర్ 08: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ మండలం జగన్నాధపురం,నగరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) కాంగ్రెస్ పార్టీ బలపరిచి న జగ న్నాధపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన కోనేరు చిన్ని.ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు,500 కి గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్ సర్వీసు అందించడం జరిగిందని గుర్తు చేశారు.ఇదే కాకుండా పేదవాడి కి సొంత ఇంటి కళా నెరవేర్చటం,SC వర్గీకరణ,రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తామ ని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్…
ఆర్టిజన్ కుటుంబానికి కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ ఆర్థిక సాయం కామారెడ్డి పరివర్తన అవాజ్ డిసెంబర్ 08: కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన, ఎంబరి గౌరయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుమారుడు ఏంబరి రామచంద్రం, విద్యుత్తు ఆర్టిజన్గా ఇసాయిపేటలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఇట్టి అకాల మరణాన్ని, కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ తీవ్ర సానుభూతిని వ్యక్తపరిచింది, తమ జాక్ కుటుంబానికి, సానుభూతిపరంగా ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ నాయకులు, ఎం. నాంపల్లి, యు. బాల్ నర్స్. ఉప్పు స్వామి, ఎస్ రాజు, వై. పోచయ్య. తదితరులు పాల్గొన్నారు.
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మాదేవేందర్ రెడ్డి. (పరివర్తన)/ ఆవాజ్ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్,మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి ఆరాధ్య దైవం అన్నారు. అభయాంజనేయ స్వామి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే.చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె.జితేందర్ గౌడ్, నాయకులు ఉమామహేశ్వర్, రాజు యాదవ్, దాసు, సుభాష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో వలస కూలీల పిల్లల దుర్భర పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం (పరివర్తన) ఆవాస్ న్యూస్ మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులోని ఎస్‌జి స్నాక్స్ పరిశ్రమ వద్ద బీహార్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీల పిల్లలు అమానుష పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన కూలీలతో పాటు వారి పిల్లలు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. అయితే వారికి కనీస అవసరాలైన వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్య వంటి సౌకర్యాలు లేకపోవడంతో జీవితం అద్వానంగా మారింది. సుమారు 30 మంది చిన్నారులు ఎలాంటి సదుపాయాలు లేని ప్రాంతంలో రోజంతా మట్టిలో ఆడుతూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ యాజమాన్యం పిల్లల కోసం సౌకర్యం కూడా కల్పించకపోవడంతో పాటు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యను పట్టించుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. బాల కార్మిక వ్యవస్థ, శిశు…
ప్రభుత్వ భూమిలో ఎస్ జి స్నాక్స్ కంపెనీ నిర్మాణం! ఏడాదిగా నిద్రమత్తులో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న పంచాయతీ కార్యదర్శి మెదక్ జిల్లా ప్రతినిది డిసెంబర్ 6 (పరివర్తన అవాజ్), పేదలు పూరి గుడిసె వేసుకోవడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఒక గుంట భూమి ఇవ్వమంటే ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వాలు, స్థానిక అధికారులు.. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని మాత్రం వ్యాపారులకు కట్టబెడుతున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం, కామారం పంచాయతీ పరిధిలో జరిగిన భూ కబ్జా వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కామారం పంచాయతీ పరిధిలో గల 166 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 0.39.5 గుంటల…
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మృత్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పరివర్తన అవాజ్– కారేపల్లి, డిసెంబర్ 6: మండలంలోని బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీరా బావుసింగ్- సువాలి కుమారుడు అజ్మీరా విజయ్ కుమార్ విద్యుత్ ఘాతంలో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ హనుమంతరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు శనివారం మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా హనుమంత రావు మాట్లాడుతూ… విజయ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మృత్యువు కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హాట్కార్ రాంబాబు నాయక్, అజ్మీరా హేమ్లా నాయక్, అజ్మీరా నారాయణ, అజ్మీరా రవి, మాలోత్ బాలు, అజ్మీరా శంకర్ అజ్మీరా దేవా, జర్పలా రామారావు, అజ్మీర చిట్టిబాబు, అజ్మీరా రామారావు, బానోత్ బాబు,అజ్మీరా తిరుపతి,…
చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ లో నుంచి నలుగురు సస్పెండ్! చల్లసముద్రం పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 06: చల్లసముద్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి భిక్షంకు వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఎల్లంపల్లి బుచ్చయ్య, సట్ల శ్రీను, మరియు మోడెం కోటయ్య,కాటూరి సతీష్ లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు భంగం కలిగించే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, 29 గ్రామ పంచాయతీలలోని అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపించబడిందని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ కింద ₹10…
మద్యం విక్రయాదారులపై కేసు నమోదు. పరివర్తన ఆవాజ్ పెనుబల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు పెనుబల్లి మండలం గంగదేవి పాడు లోని కిరణ షాపు యజమాని తేజావత్ బాలు అక్రమంగా ఎక్కువ ధరలకు మధ్య విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో వి యం ఎస్ఐ వెంకటేష్ కిరాణా దారుడు పై కేసు నమోదు చేశారు
ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను కాజేసిన రంగారెడ్డి జిల్లా ఏడీ! రంగారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 05 . రంగారెడ్డి జిల్లా లో ప్రభుత్వ భూముల పత్రాలతో అక్రమాలకు పాల్పడి, ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన ఓ ప్రభుత్వ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎట్టకేలకు వల పన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఏడీ శ్రీనివాసులు తన పదవిని దుర్వినియోగం చేస్తూ, తప్పుడు సర్వే నెంబర్లను సృష్టించడం ద్వారా విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అక్రమాల ద్వారానే…
బాడీబిల్డింగ్ లో సత్తా చాటిన రామాయంపేట యువత రామయంపేట పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 5 : ఐసీఎన్ షోలో పథకాల పంట పథకాలు సాధించిన వివేక్ వర్ధన్ సాయి వర్ధన్ డాక్టర్సతీష్ రామయంపేట ప్రతిష్టాత్మక ఐసీఎన్ (ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అండ్ న్యూట్రిషన్) అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ షోలో రామాయంపేట యువకులు సత్తా చాటారు. రామయంపేట పట్టణంలోని ‘ఫైట్ టు ఫిట్’ జిమ్ ట్రైనర్ బత్తిని శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బృందం, ఇటీవల గోవాలో జరిగిన ఐసిఎన్ పోటీలలో పాల్గొన్నారు. వివేక్ వర్ధన్ అద్భుత ప్రదర్శన కనబరిచి 3వ స్థానం దక్కించుకోగా, సాయి వర్ధన్ గట్టి పోటీ మధ్య 4వ స్థానంతో తన ప్రతిభను చాటారు. డా.సతీష్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.శిక్షణ, పట్టుదలతో ఈ స్థాయి విజయాన్ని సాధించిన యువకులను కోచ్ శ్రీకాంత్, రామాయంపేట ప్రజలు అభినందించారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.