Author: parivarthanaawaaz
మానవత్వం చాటుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ (పరివర్తన ఆవాజ్) రామాయంపేట: అక్కన్నపేట గ్రామ శివారులోని మెదక్ రామాయంపేట రహదారి అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సహాయపడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆయన తన గన్‌మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్, సహాయంతో గాయపడిన…
28 వార్డులో నీటి సమస్యను పరిషరిస్తా 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుంటా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండి పూజ నరేష్ (పరివర్తన ఆవాజ్ ) 28వార్డులో గతపాలకులు హామీలు ఇచ్చి వార్డు అభివృద్ధి చెయ్యలేదుని మాటకు కట్టుబడి వుంటామని హామీలు ఇచ్చి మాటలు తప్పరని 28 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బండి పూజనరేష్ ఆరోపించారు. బుధువారం రోజున మెదక్ మున్సిపల్ కార్యాలయంలో 28 వార్డు నుండి బిఆర్ ఎస్ పార్టీ నుండి నామినేషన్ ధఖాలు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి నా లక్ష్యంని వార్డులొ అన్ని…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ (పరివర్తన అవాజ్) తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యం తోనే ప్రభుత్వ పాఠశాల లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు…
ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (పరివర్తన ఆవాజ్ ) పవిత్ర ఏడుపాయల వరదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పవిత్ర ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఘనంగా నిర్వహించాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్,విద్యుత్ ,తాగునీరు బార్కెట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు.జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చిత్త సేకరణ, బ్లీచింగ్…
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకే బిజెపి కుట్ర జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే సహించేది లేదు (పరివర్తన అవాజ్) మెదక్ జిల్లా చిన్నశంకరం పేటమండలం కొరివి పల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ నిరసన కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాలువాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు అనంతరం కొరివి పల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం…
మెదక్ మున్సిపల్ ఎన్నికలసందడి తొలిరోజు 12 నామినేషన్లు (పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా మెదక్ పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైనబుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (BRS) పార్టీ నుండి 5 . BJP పార్టీ నుండి 2 నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించాలని ఎన్నికల అధికారి తెలిపారు మున్సిపల్ కార్యాలయం ముందు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి…
రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి తొలిరోజు 7 నామినేషన్లు (పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా రామాయంపేట పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన బుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 7 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (TRS) పార్టీ నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం…
పరివర్తన అవాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన టేకులపల్లి గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్. పాల్గొన్న బేతంపూడి సొసైటీ మాజీ చైర్మన్ లక్కినేని సురేందర్. తెలంగాణ ధైర్యం అవాజ్ న్యూస్. టేకులపల్లి పరివర్తన అవాజ్ , జనవరి 21. పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరివర్తన అవాజ్ ప్రతినిధులు, పాఠకులు, అభిమానులు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్‌లో సామాజిక స్పృహను ప్రతిబింబించే అంశాలు, ముఖ్యమైన తేదీలు, పండుగలు, జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత గల రోజులను పొందుపరిచారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో పాటు వార్తా విలువలకు అనుగుణంగా క్యాలెండర్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పరివర్తన అవాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజల…
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరు. కడసారి చూసేందుకు పోటెత్తిన ఆత్మీయులు.. పార్టీలకతీతంగా తరలివచ్చి పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కన్నీటి పర్యంతమైన సహచరులు.. అన్నమయ్య జిల్లా, జనవరి 20 (పరివర్తన అవాజ్) ~మదనపల్లి -:- తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన బిల్లూరివారిపల్లి గ్రామానికి చెందిన ప్రజా సేవకుడు, నిస్వార్థ పరుడు, మంచికి మారు పేరుగల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములకలచెరువు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి బిల్లూరి వివేకానంద రెడ్డి (75) అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాఘమాసం ప్రారంభ దినం పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం…
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సహకారం అందించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో CSR బృంద సభ్యులు గురువారం జిల్లాలోని పలు పాఠశాలలు మరియు భవిత కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ మండలంలోని భవిత కేంద్రం మరియు కోయ గట్టు పాఠశాలలను పరిశీలించారు. కోయ గట్టు పాఠశాల వద్ద కౌజు పిట్టల పెంపకం ద్వారా ఒక సాధారణ వ్యక్తికి వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాలపై జిల్లా కలెక్టర్ CSR బృంద సభ్యులకు వివరించారు.అనంతరం బూర్గంపాడు మండలంలోని చెరువు సింగారం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి CSR నిధుల ద్వారా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ బృంద సభ్యులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి CSR…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.