Author: parivarthanaawaaz

బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన, రైతుల కోసం కొత్త విద్యుత్ లైన్‌కు శ్రీకారం,అంగన్‌వాడీ, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన పరివర్తన అవాజ్ న్యూస్ బయ్యారం /పబ్బు శివ: ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు మంగళవారం బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నూతన విద్యుత్ లైన్ ప్రారంభం:నామాలపాడు గ్రామ పంచాయతీ ధర్మాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్థం 33/11 కెవి నూతన విద్యుత్ లైన్ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు శ్రీకారం చుట్టారు. ఈ లైన్‌ను సుమారు రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన:మండలంలోని కొత్తపేట, గంధంపల్లి, బాలాజిపేట గ్రామాలలో ఎమ్మెన్నార్ఈజీఎస్ పథకం క్రింద మంజూరైన నూతన అంగన్‌వాడీ భవనాలకు, అలాగే గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఎమ్మెల్యే…

Read More

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పై రేగోడులో సమీక్షా సమావేశం – కలెక్టర్ పర్యవేక్షణ”  మెదక్  జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)   మంగళవారం రేగోడు మండలం రైతు వేదికలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ అమలుపై మెదక్ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ,జిల్లా వ్యవసాయ అధికారి ‌ రైతులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుత  దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారాఅధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చు అని తెలిపారు.దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు.జాతీయ నూనె గింజల”…

Read More

   లింగంపల్లి భస్తి దవాఖానను సందర్శించిన హరీశ్ రావ్ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్  అక్టోబర్ 21, మాజీ మంత్రి హరీశ్ రావ్ మంగళవారం నాడు లింగంపల్లి గ్రామంలో భస్తి దవాఖానను సందర్శించారు దవాఖాన నిర్వహిస్తున్న తీరు ప్రజలకు చేస్తున్న వైద్యం వివరాలను పరిశీలించారు అయితే భస్తి దవాఖాన నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుందని అవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావ్ మాట్లాడుతూ బస్తి దవాఖానాల్లో ప్రజలకు సుస్తీ చేస్తే చికిత్స చేయాల్సిన దవాఖానల్లో మందులు,టెస్టులు అందుబాటులో లేవని దవాఖాన సిబ్బందికి కూడా సరిగ్గా జీతాలే అందడం లేదని తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానలకే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సుస్తీ చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సౌలభ్యం కోసం కేసీఆర్ ఈ బస్తీ దవాఖానాలను ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసి 110 రకాల మందులను 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన రవికి నివాళి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు” సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం… -ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.. *అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)  సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి కేఆర్ నాగరాజు స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన…

Read More

ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి,   పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం లో స్మృతి   పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి   అర్పించిన…జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపియస్. *   పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 21 మహబూబాబాద్,    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరం లో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను…

Read More

పోలీసు స్మృతి దినోత్సవం ఘనంగా నిర్వహణ – ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పాల్గొనడం, పోలీస్ స్మృతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం.. -పోలీస్ అమరవీరులకు స్థూపానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు … -అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యేలు, సిపి, కలెక్టర్లు, కమిషనర్.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్)  హన్మకొండ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం పోలీస్ స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, వరంగల్ నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్,…

Read More

పూలే విగ్రహ ధ్వంసం పై బీసీల ఘాటు హెచ్చరిక – నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి” మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి… బీసీల ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చాలా బాధాకరం.. విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు.. బీసీలపై ప్రేమ అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో సమాధానం చెప్పి తీరాలి… వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్.. వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) వరంగల్ నగరంలో ఉర్సు దర్గా ప్రాంతంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనకు బాధ్యులన్నీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కఠినంగా…

Read More

        పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం                     వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 21 (పరివర్తన అవాజ్) శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, వరంగల్, హనుమకొండ…

Read More

అమరుడైన పోలీస్ కుటుంబానికి రూ.1 కోటి, ఉచితంగా భూమి.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన, పరివర్తన అవాజ్, హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి…

Read More

                  హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి పరివర్తన అవాజ్,      ప్రముఖ బాలీవుడ్, గుజరాతీ నటుడు గోవర్ధన్ అస్రానీ (84) అక్టోబర్ 20వ తేదీ అనారోగ్యంతో హాస్పిటల్ కన్నుమూశారు. జైపూర్ లో సింధీ కుటుంబానికి చెందిన అస్రానీ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారం చేయడం ఇష్టంలేక సినిమాల్లోకి వచ్చారు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత గుజరాతీ, హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన మూడు వందలకు పైగా చిత్రాలలో నటించారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ యాక్ట్ చేశారు. తన సహ నటి మంజు బన్సాల్ ను ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వివాహానంతరం కూడా వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో నటించారు. 1975లో విడుదలైన ‘షోలే’ సినిమాలో జైలర్…

Read More