Monday, September 14, 2026
Home Politics కొత్తగూడెం క్లబ్బులో జిఎల్ఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్–ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన సభ

కొత్తగూడెం క్లబ్బులో జిఎల్ఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్–ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన సభ

0
46
IMG-20260112-WA0088

📰 Generate e-Paper Clip

 

 

పరివర్తన అవాజ్,కొత్తగూడెం 

కొత్తగూడెం క్లబ్బులో గిరిజన లంబాడి సంఘాల జిఎల్ఎస్ (GLS) ఆధ్వర్యంలో నంద తండా గ్రామ సర్పంచ్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ (W/o చిన్నా) లకు ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.

గ్రామాభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ జిఎల్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం, ఉపసర్పంచ్ మంగమ్మలను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్య, రహదారులు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్–ఉపసర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. సభ మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.