కొత్తగూడెం క్లబ్బులో జిఎల్ఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్–ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన సభ

    పరివర్తన అవాజ్,కొత్తగూడెం  కొత్తగూడెం క్లబ్బులో గిరిజన లంబాడి సంఘాల జిఎల్ఎస్ (GLS) ఆధ్వర్యంలో నంద తండా గ్రామ సర్పంచ్ బలరాం మరియు ఉపసర్పంచ్ మంగమ్మ (W/o చిన్నా) లకు ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గ్రామాభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ జిఎల్ఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం, ఉపసర్పంచ్ మంగమ్మలను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు...