Friday, September 11, 2026
Home Uncategorized అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు

అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు

0
39

📰 Generate e-Paper Clip

అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు,

• రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానం.
• అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.
• పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.
• పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 21-10-2025 నుండి 31-10-2025 వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్కామారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ ప్రజల భద్రతకు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారు. వారి త్యాగల ఫలితమే నేటి మన శాంతియుత భద్రతతో కూడిన సమాజం అని ఎస్‌పి తెలిపారు.
వారి వీరోచిత త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గారి ఆదేశాల మేరకు, ఈ నెల 21 నుండి 31 వరకు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి మరియు బాన్స్వాడ డివిజన్‌ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారని జిల్లా ఎస్పీ  తెలిపారు.
విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు (Online Essay Competitions):
తేదీలు: అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 28, 2025 వరకు
భాషలు: తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ
విషయం (Essay Topic):
“Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs”
(డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్‌ నుండి ఎలా దూరంగా ఉండగలరు)
పాల్గొనే విధానం:
1. కింది లింక్ ద్వారా ఆన్లైన్‌లో నమోదు చేయాలి – https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయాలి.
3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (Image) లేదా PDF రూపంలో అప్‌లోడ్ చేయాలి (గరిష్టంగా 500 పదాలు మాత్రమే).
ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులను జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతులతో సత్కరించి, రాష్ట్రస్థాయికి ఎంపిక చేయబడతారని ఎస్పీ  తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని సూచించారు.
ఫోటోగ్రఫీ & షార్ట్ ఫిల్మ్ పోటీలు:
విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొనవచ్చును.
పోలీసులు చేసిన సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవ వంటి అంశాలపై మూడునిమిషాల లోపు  గల షార్ట్ ఫిల్మ్‌లు లేదా సమాజంలో పోలీసుల ప్రతిష్ఠను పెంపొందించే ఫోటోలు రూపొందించవచ్చు.
సమర్పణకు చివరి తేది: అక్టోబర్ 23, 2025
సమర్పణ స్థలం: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం (డ్యూటీ ఆఫీసర్ వద్ద)
రూపం: ఫోటోలు (ప్రింట్ లేదా డిజిటల్), షార్ట్ ఫిల్మ్‌లు (పెన్ డ్రైవ్ రూపంలో)
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన మూడు ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. వీరిలో ఉత్తములను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించబడుతుందని అని ఎస్పీ  పేర్కొన్నారు.
 
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల కార్యక్రమాల వివరాలు :
• 20-10-2025: బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు.
• 21-10-2025: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయం 8 గంటలకు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం.
• 22-10-2025: అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం (కామారెడ్డి డివిజన్‌లో).
• 24-10-2025: అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం (ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలో).
• 25-10-2025: సైకిల్ ర్యాలీ.
• 27-10-2025: కామారెడ్డి డివిజన్‌లో కాలనీలు, గ్రామాల్లో ప్రజల అవసరాలు గుర్తించడం.
• 28-10-2025: ఎల్లారెడ్డి మరియు బాన్సువాడ డివిజన్‌లలో ప్రజా అవసరాల సేకరణ.
• 29-10-2025: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం.
• 30-10-2025: ఓపెన్ హౌస్ కార్యక్రమం.
• 31-10-2025: క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం.
పోలీస్ అమరవీరుల వీరత్వాన్ని స్మరించుకునే ఉద్దేశ్యంతో పోలీస్ కళా బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ప్రజలు, విద్యార్థులు, యువత, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని, పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పించాలని జిల్లా ఎస్‌పి  విజ్ఞప్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.