Sunday, October 25, 2026
Home People కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు

కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు

0
10

📰 Generate e-Paper Clip

– పదోన్నతితో కొత్త బాధ్యతలు, మరింత అంకితభావంతో విధుల నిర్వహణకు అవకాశం
– ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించాలి
– పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ , మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించి, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ఆకాంక్షించారు.

పదోన్నతి పొందిన పోలీసు సిబ్బంది వివరాలు:

1. బి. రమేష్ – పీసీఆర్ కంట్రోల్ రూమ్
2. ఎం. సదయ్య – రామారెడ్డి పోలీస్ స్టేషన్
3. పి. రాధాకృష్ణ – బిచ్కుంద పోలీస్ స్టేషన్
4. టి. వీరబాబు – బీర్కూర్ పోలీస్ స్టేషన్
5. జి. సాయిలు – బాన్సువాడ పోలీస్ స్టేషన్
6. ఆర్. బన్సీలాల్ – లింగంపేట పోలీస్ స్టేషన్
7. కె. రమేష్ – లింగంపేట పోలీస్ స్టేషన్

జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ… పోలీసు శాఖలో పదోన్నతులు సిబ్బంది వృత్తిపరమైన ఎదుగుదలకు ప్రతీకలని, అదే సమయంలో వారి బాధ్యతలను మరింత పెంచుతాయని తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బంది కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని, విధి నిర్వహణలో ఆదర్శంగా నిలవాలని పదోన్నతి పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ, తమపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించిన ఉన్నతాధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.