Friday, October 23, 2026
Home People నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

0
6

📰 Generate e-Paper Clip

( పరివర్తన అవాజ్ ) కామారెడ్డి, ప్రతినిధి అక్టోబర్ 23: వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన మొక్కలకు నీరు పోసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, వన మహోత్సవం సందర్భంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అది ఆరోగ్యంగా పెరిగేలా చూడటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్, ఎంపీడీవో నాగేశ్వర్, తహశీల్దార్ ఉమలత, ఏఈ పీఆర్ సురేష్, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్ విష్ణువర్ధన్, ఏఈ ట్రాన్స్‌కో సుధాకర్, ఏపీఓ ధర్మారెడ్డి, సర్పంచ్ కిషన్ యాదవ్, ఉప సర్పంచ్ మధుకర్, పంచాయతీ కార్యదర్శి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.