నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

( పరివర్తన అవాజ్ ) కామారెడ్డి, ప్రతినిధి అక్టోబర్ 23: వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన మొక్కలకు నీరు పోసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, వన మహోత్సవం సందర్భంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అది ఆరోగ్యంగా పెరిగేలా చూడటం కూడా...