Friday, October 23, 2026
Home People టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 23 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా గైనీ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా సదాశివనగర్ మండల అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయగౌడ్ మాట్లాడుతూ గైనీ శ్రీనివాస్ గౌడ్ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన జొన్నల రాము, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వినోద్‌లను కూడా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, తాడ్వాయి మండల అధ్యక్షుడు భుజంగ్ రావు, సదాశివనగర్ మండల ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.