పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 24
రిటైర్డ్ డీసీపీ శ్రీ సుదర్శన్ గౌడ్ ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గురువారం పరామర్శించారు.పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు విశేష సేవలందించి, తన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, సేవా పతకాలు అందుకున్న బ్యాచ్‌మేట్, మిత్రుడు సుదర్శన్ గౌడ్ ని భీమారంలోని వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే నాగరాజు ఆప్యాయంగా కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ తో కొంతసేపు ముచ్చటించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాసేవలో పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన సుదర్శన్ గౌడ్ తో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే నాగరాజు గుర్తుచేసుకున్నారు. పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.అనారోగ్య సమయంలో ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందించే ధైర్యం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొంటూ, సుదర్శన్ గౌడ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు.




