-పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక జీడబ్ల్యూఎంసీ: సెప్టెంబర్ 23:
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను సెంట్రల్ జోన్ డిసిపి ధారా కవితతో కలిసి కమిషనర్ టి. వెంకన్న బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి నగర పరిధిలోని ప్రధాన గణేష్ నిమజ్జన ప్రాంతాలను సందర్శించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ముందుగా పరికికుంట, కడిపికొండ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్, అనంతరం హసన్‌పర్తి చెరువు, భీమారం చెరువు, గోపాల్‌పూర్‌లోని అరెకసాయికుంట, గుండ్ల సింగారం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రాంతం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.అదేవిధంగా చిన్నవడ్డేపల్లి చెరువు, కట్ట మల్లన్న చెరువు, అగర్తల కోట, వరంగల్; బెస్తం చెరువు; ఉర్సు రంగసముద్రం (ఉర్సుగుట్ట); సిద్ధేశ్వర గుండం; బంధం చెరువు ప్రాంతాలను ప్రాంతాలను సందర్శించి నిమజ్జనానికి వచ్చే గణేష్ విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్లు, బ్యారికేడింగ్, లైటింగ్, పారిశుద్ధ్య చర్యలు, రహదారుల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించారు.నిమజ్జన ప్రాంతాల్లో తగినంత వెలుతురు, తాగునీరు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు, భద్రతా చర్యలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ నిర్వహణకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే నిమజ్జన ప్రాంతాల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు.గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రజలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్య, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ టి. వెంకన్న కోరారు.ఈ పరిశీలనలో అదనపు కమిషనర్ జోనా, బల్దియా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, పీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ లు ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, మాధవి, సంతోష్‌బాబు, మహేందర్, సంజయ్‌కుమార్, డి ఈ లు ఏఈలు సానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




