–నిమజ్జన కేంద్రాల్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న….

-పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  జీడబ్ల్యూఎంసీ: సెప్టెంబర్ 23: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను సెంట్రల్ జోన్ డిసిపి ధారా కవితతో కలిసి కమిషనర్ టి. వెంకన్న బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి నగర పరిధిలోని ప్రధాన గణేష్ నిమజ్జన ప్రాంతాలను సందర్శించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ముందుగా పరికికుంట, కడిపికొండ ఔటర్...