Monday, September 21, 2026
Home People –ప్రజల వినతులకు సత్వర పరిష్కారం అందించాలి : బల్దియా కమిషనర్ వెంకన్న… –ప్రజావాణిలో 94 దరఖాస్తుల...

–ప్రజల వినతులకు సత్వర పరిష్కారం అందించాలి : బల్దియా కమిషనర్ వెంకన్న… –ప్రజావాణిలో 94 దరఖాస్తుల స్వీకరణ…

0
2

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  GWMC, సెప్టెంబర్ 21 :

ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న పేర్కొన్నారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావానికి అనుగుణంగా సంబంధిత విభాగాలకు బదలాయించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించబోమని అధికారులను ఆయన హెచ్చరించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.గత వారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించడంతో పాటు, తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అనవసర జాప్యం చోటుచేసుకుంటే సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ప్రజలకు అందించే ప్రతి పౌర సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ప్రధానంగా ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలు:టౌన్ ప్లానింగ్ – 41,ఇంజినీరింగ్ – 29,ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 10,రెవెన్యూ – 08,నీటి సరఫరా – 05,హార్టికల్చర్ – 01 మొత్తం 94 దరఖాస్తులు…ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.