Monday, September 21, 2026
Home Health –ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా...

–ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్తూ…

0
1

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె. చొంగ్తు,
ఐఏ ఎస్ , రాష్ట్ర వైద్య విద్యా శాఖ సంచాలకు డాక్టర్ వాణి లతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య సోమవారం సందర్శించారు.తొలుత ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. నిన్న ఈ వార్డులో పెచ్చులు ఊడిపడటానికి దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏం.జి.ఏం లో
అందుతున్న వైద్య సేవలు, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి భవన స్థితిగతులపై ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్‌రెడ్డి,టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ప్రసాద్‌లను అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రి భవనాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటు, విధుల హాజరుపై ఆరా తీశారు.ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు.విధులకు సమయపాలనతో హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణను కూడా సమీక్షించారు.రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.