–ప్రజల వినతులకు సత్వర పరిష్కారం అందించాలి : బల్దియా కమిషనర్ వెంకన్న… –ప్రజావాణిలో 94 దరఖాస్తుల స్వీకరణ…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 21 : ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న పేర్కొన్నారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావానికి అనుగుణంగా సంబంధిత విభాగాలకు బదలాయించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించబోమని అధికారులను ఆయన హెచ్చరించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ...