Monday, September 21, 2026
Home People  గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని.. వివిధ గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు.. భక్తులతో కలిసి ఉత్సవాల్లో...

 గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని.. వివిధ గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు.. భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

0
7

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ::  హన్మకొండ  సెప్టెంబర్ 21

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు సోమవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో ప్రతిష్ఠించిన గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.నియోజకవర్గంలోని 54వ, 53వ, 58వ, 51వ మరియు 5వ డివిజన్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.ప్రతి గణేష్ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మండపాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ఆయా గణేష్ మండపాలను సందర్శించిన సందర్భంగా స్థానిక నాయకులు,ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.