Monday, September 21, 2026
Home People —గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు…. -అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే...

—గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు…. -అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు..

0
2

📰 Generate e-Paper Clip

 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక

హనుమకొండ, సెప్టెంబర్ 21: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సోమవారం సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.57వ డివిజన్ పరిధిలోని ఓల్డ్ బస్ డిపో సమీపంలో శ్రీ గోకుల్ గజన్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని ఎమ్మెల్యే దంపతులు సందర్శించారు.అనంతరం 58వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో శ్రీ గజాననా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక సన్నిధిలో నిర్వహించిన అన్నదాన వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అభినందించారు. ప్రజలందరూ గణనాథుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.