గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని.. వివిధ గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు.. భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక :: హన్మకొండ సెప్టెంబర్ 21 గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు సోమవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో ప్రతిష్ఠించిన గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.నియోజకవర్గంలోని 54వ, 53వ, 58వ, 51వ మరియు 5వ డివిజన్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని...