Friday, September 11, 2026
Home People ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య , పలు కీలక అంశాలపై...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య , పలు కీలక అంశాలపై విస్తృత చర్చ

0
75

📰 Generate e-Paper Clip

  పరివర్తన ఆవాజ్ హైదరాబాద్: మాజీ మంత్రివర్యులు, తెలంగాణ శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శ్రీ బస్వరాజు సారయ్య   రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డిను, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీని పలు కీలక అంశాలపై విస్తృత చర్చగ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను నిర్వహించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌తో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.