ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య , పలు కీలక అంశాలపై విస్తృత చర్చ
పరివర్తన ఆవాజ్ హైదరాబాద్: మాజీ మంత్రివర్యులు, తెలంగాణ శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శ్రీ బస్వరాజు సారయ్య రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డిను, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు,...