పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : వనమహోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పేరా లీగల్ వాలంటరీస్ విజ్ఞప్తి మేరకు బూర్గంపాడు మండలానికి చెందిన ఒక హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల వితరణ చేశారు. జిల్లా కేంద్రంలో ప్ ఔషధ మొక్కలను వితరణ చేశారు. వన మహోత్సవంలో భాగంగా కామారెడ్డి జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గౌరవ ఎన్ వై , గిరి చేతుల మీదుగా ఔషధ మొక్కలు వితరణ చేశారు..పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఔషధ మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.ఒక హృదయం ఎన్జీవో కామారెడ్డిలో 60 వేల మొక్కలు వితరణ పూర్తి చేసుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని సంస్థ తెలియజేసింది కార్యక్రమంలో పి ఎల్ వి. షేక్ అలీముద్దీన్. స్వప్న రెడ్డి మరియు ఇతర పి ఎల్ వి కూడా పాల్గొన్నారు




