Friday, September 11, 2026
Home People 36వ డివిజన్ చింతల్‌లో వర్షపు నీటితో ఇబ్బందులు

36వ డివిజన్ చింతల్‌లో వర్షపు నీటితో ఇబ్బందులు

0
29

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ చింతల్:హదారిపై చెరువును తలపిస్తున్న వర్షపు నీరు – ప్రజలకు తీవ్ర అవస్థలు చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమవుతుండటంతో 36వ డివిజన్ చింతల్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి పక్కన వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.రహదారిపై పెద్ద మొత్తంలో నీరు నిలిచి ఉండటంతో ఇది రోడ్డా.. చెరువా అనే పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులు నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుండగా, వాహనాలు వెళ్లే సమయంలో నీరు చుట్టుపక్కల చిమ్మడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పక్కన మట్టి, గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నీరు నిలిచే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి వర్షపు నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి.. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి” అని స్థానికులు కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.