36వ డివిజన్ చింతల్‌లో వర్షపు నీటితో ఇబ్బందులు
పరివర్తన ఆవాజ్ చింతల్:హదారిపై చెరువును తలపిస్తున్న వర్షపు నీరు – ప్రజలకు తీవ్ర అవస్థలు చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమవుతుండటంతో 36వ డివిజన్ చింతల్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి పక్కన వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.రహదారిపై పెద్ద మొత్తంలో నీరు నిలిచి ఉండటంతో ఇది రోడ్డా.. చెరువా అనే పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులు నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుండగా, వాహనాలు వెళ్లే సమయంలో నీరు చుట్టుపక్కల చిమ్మడంతో పాదచారులు ఇబ్బందులు...