Friday, September 11, 2026
Home People రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఘన నివాళులు

రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఘన నివాళులు

0
26

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి గారి జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి గారు తెలంగాణ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య, సామాజిక అభ్యున్నతి, ప్రజా సేవా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డిలో విగ్రహ ప్రతిష్ట జరపాలని శ్రీ ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినారు.కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రజలు, వివిధ రెడ్డి సంఘాల సభ్యులు సహకరించాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులు ఎస్. లక్ష్మారెడ్డి , ప్రధాన కార్యదర్శి పి. రామచంద్ర రెడ్డి , ఉపాధ్యక్షులు గుండ్రెడ్డి హనుమంత్ రెడ్డి, సలహాదారులు మల్లేష్ మోహన్ రెడ్డి , కార్యదర్శులు సాయిబాబు రెడ్డి, సంతోష్ రెడ్డి , గుర్రం తినాలి గుర్రం శ్రీనివాస్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి గారికి ఘన నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.