ఈనెల 19వ తేదీన తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర కళాశాల కబడ్డీ టోర్నమెంట్ లో
ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థినిలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి శోభారాణి అభినందించారు
కామారెడ్డి జిల్లా పరివర్తన అవాజ్: సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి(మర్కల్ ) కి చెందిన విద్యార్థినులు ఈ నెల 19 వ తేదీన తెలంగాణ యూనివర్సిటీ నందు నిర్వహించిన అంతర కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ లో ఉత్తమమైన ప్రతిభ చూపించి ద్వితీయ బహుమతి సాధించారు.ఈ కబడ్డీ టీం నుండి ప్రాతినిద్యం వహించిన విద్యార్థినులు వరుసగా బి. ఏ.సెకండ్ ఇయర్ నుండి ఎం. సరిత,కే. స్వప్న, బి. జడ్. సి ఫస్ట్ ఇయర్ నుండి ఎం. వెన్నెల, బి. కన్య, ఎం. బి. జడ్. సి. ఫస్ట్ ఇయర్ నుండి బి. శ్వేత రాణి ,బి. కామ్. జనరల్ సెకండ్ ఇయర్ నుండి బి. శ్రీవిద్య, బి. కామ్ సి. ఏ. ఫస్ట్ ఇయర్ నుండి సి హెచ్. స్వప్న, కే. పంచపూల, ఎం. మహేశ్వరి బి. ఏ. ఫస్ట్ ఇయర్ నుండి కే. స్వప్న. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తో పాటు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించారు.




