Sunday, November 22, 2026
Home People గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఉర్దూ జర్నలిస్టులకు సమాన ప్రాతినిధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఉర్దూ జర్నలిస్టులకు సమాన ప్రాతినిధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి

0
20

📰 Generate e-Paper Clip

బైలాస్ సవరణ కమిటీకి టీయూడబ్ల్యూజేయూ వరంగల్ యూనిట్ వినతి.. ప్రత్యేక బాక్స్‌లోనూ ప్రతిపాదనలు సమర్పణ

వరంగల్, పరివర్తన అవాజ్ నవంబర్ 20: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఉర్దూ జర్నలిస్టులకు సమాన ప్రాతినిధ్యం, సభ్యత్వ హక్కులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజేయూ) వరంగల్ యూనిట్ ప్రెస్ క్లబ్ బైలాస్ సవరణ కమిటీకి సమగ్రంగా లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణను క్రమబద్ధీకరించడంతో పాటు నూతన బైలాస్ రూపకల్పనలో భాగంగా కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతోంది. ఈ నేపథ్యంలో టీయూడబ్ల్యూజేయూ వరంగల్ యూనిట్ కన్వీనర్ మిర్జా ఫతహుల్లా బేగ్ రియాజ్ యూనియన్ తరఫున రూపొందించిన ప్రతిపాదనలను ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్‌లో సమర్పించారు. అంతేకాకుండా బైలాస్ సవరణ కమిటీలోని సభ్యులందరికీ వ్యక్తిగతంగా వినతిపత్రం ప్రతులను అందజేశారు. కమిటీ కన్వీనర్ పి.వి. మదన్ మోహన్‌కు సమర్పించిన వినతిపత్రంలో నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. ఉర్దూ మీడియాకు చెందిన కనీసం ముగ్గురు ప్రతినిధులకు ప్రెస్ క్లబ్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని, భాషాపరమైన వివక్ష లేకుండా అర్హులైన ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ఇతర జర్నలిస్టు సంఘాల మాదిరిగానే ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో టీయూడబ్ల్యూజేయూ అధికారిక లోగోను ప్రముఖంగా ఏర్పాటు చేయాలని, ఉర్దూ జర్నలిస్టుల సమావేశాలు, సంస్థాగత కార్యక్రమాలు, వృత్తిపరమైన చర్చల కోసం ప్రత్యేక గది లేదా నిర్దిష్ట స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2017లో స్థాపించబడిన తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ దేశంలో ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నమోదైన ఏకైక ట్రేడ్ యూనియన్‌గా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. జర్నలిస్టు సమాజంలో ఉర్దూ జర్నలిస్టులు కూడా అంతర్భాగమని, వారికి సమాన గుర్తింపు, ప్రాతినిధ్యం, సదుపాయాలు కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. నూతన బైలాస్‌కు తుది రూపం ఇచ్చే సమయంలో ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని మిర్జా ఫతహుల్లా బేగ్ రియాజ్ కమిటీని కోరారు. అన్ని భాషల జర్నలిస్టుల మధ్య సమానత్వం, ఐక్యత, సోదరభావం మరింత బలోపేతం కావడానికి ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.