
మర్కోడు: ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ సర్పంచులు, ఉపసర్పంచులు, సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు, వివిధ కమిటీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని గుర్తుచేసుకున్నారు.వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.దివంగత మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు. 🕯️🙏జోహార్ వైయస్సార్! ✊🌹



