Wednesday, September 23, 2026
Home Politics ప్రజా ప్రభుత్వంలో వరంగల్‌కు కొత్త రూపు తీసుకొస్తాం.. –హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్న :ఎమ్మెల్యే నాయిని...

ప్రజా ప్రభుత్వంలో వరంగల్‌కు కొత్త రూపు తీసుకొస్తాం.. –హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్న :ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

0
4

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22

హనుమకొండ: వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు  ఇనగాల వెంకట్రం రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి 11 గంటల వరకు వరంగల్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, ప్రతి పనికీ డెడ్‌లైన్ నిర్ణయించి ఎప్పటిలోగా పూర్తి చేయాలో స్పష్టమైన టైమ్‌లైన్ రూపొందించామని తెలిపారు.మామునూరు విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్, ఆసుపత్రులు, ఫిల్టర్‌బెడ్, దేవాలయాల అభివృద్ధి తదితర కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వచ్చే నెల దసరాలోపే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌కు రానున్నారని, కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల వేడుకలు, ఆర్ట్స్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.జీవోలు ఇచ్చి వదిలేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, నిధులు విడుదల చేసి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్నామని నాయిని అన్నారు. మామునూరు విమానాశ్రయానికి గతంలో అవసరమైన అనుమతులు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సుమారు రూ.300 కోట్లు విడుదల చేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందన్నారు. రాష్ట్రం తన బాధ్యతగా భూమిని సమకూర్చినందున విమానాశ్రయ నిర్మాణం, తదుపరి ప్రక్రియలో కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలన్నది ప్రజల అభిప్రాయాలతో నిర్ణయించుకోవచ్చని నాయిని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అనవసరమని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నాయిని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబాన్ని విమర్శించే ముందు తమ చరిత్రను చూసుకోవాలని అన్నారు.వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని నాయిని ఆరోపించారు. గత పదేళ్లలో వరంగల్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్‌సిటీ నిధులు వచ్చినా పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగించలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.ఒడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సుమారు రూ.550 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చామని నాయిని తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, పనులు ప్రారంభమయ్యాయని, మెటీరియల్ కూడా సైట్‌కు చేరుతోందన్నారు. 30–40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. చిన్నచిన్న పనులు చేసి ఫొటోలు దిగడం కాకుండా భవిష్యత్ అవసరాలకు సరిపోయే భారీ ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. గత పదేళ్ల పాలనలో అవినీతి, ఆస్తుల వ్యవహారాలపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. వాటిపై సంబంధిత నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై మాట్లాడే ముందు గత పాలనలో జరిగిన పనులపై లెక్కలు చెప్పాలని అన్నారు.సోషల్ మీడియాలో ఒక అబద్ధాన్ని పదిసార్లు ప్రచారం చేసినంత మాత్రాన అది నిజం కాదని నాయిని అన్నారు. ప్రజలు ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు కేవలం విమర్శలు చేస్తున్నారో గమనిస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ డ్రామాల కంటే వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని, తాము డేటాతో కూడిన పూర్తి ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని నాయిని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో వరంగల్‌ను కీలక నగరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మా సమాధానం మాటల్లో కాదు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఉంటుంది అని నాయిని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస రావు,అనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక,కమలాపూర్ మార్కెట్ చైర్మన్ రాణి మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు,శ్రీమాన్,విజయశ్రీ రజాలి,జక్కుల రవీందర్ యాదవ్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.