ప్రజా ప్రభుత్వంలో వరంగల్‌కు కొత్త రూపు తీసుకొస్తాం.. –హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్న :ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 హనుమకొండ: వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు  ఇనగాల వెంకట్రం రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి 11 గంటల వరకు వరంగల్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, ప్రతి పనికీ డెడ్‌లైన్ నిర్ణయించి ఎప్పటిలోగా పూర్తి చేయాలో స్పష్టమైన టైమ్‌లైన్...