Monday, September 21, 2026
Home People పైడిపల్లిలో గణనాథులను దర్శించుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ..

పైడిపల్లిలో గణనాథులను దర్శించుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ..

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21

 

వరంగల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన గణనాథులను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్* గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు అయూబ్‌ కి ఘన స్వాగతం పలికి సన్మానించారు..అనంతరం అయూబ్  మాట్లాడుతూ, గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అయూబ్‌ను ప్రత్యేకంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు జన్ను అరుణకర్, కాంగ్రెస్ నాయకులు బుద్దే పెద్దన్న, జన్ను జేసన్, జన్ను అనిల్, గాదె రాము, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.