Friday, September 25, 2026
Home People -అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన బల్దియా కమిషనర్ వెంకన్న

-అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన బల్దియా కమిషనర్ వెంకన్న

0
5

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 జిడబ్ల్యూఎంసి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ టి. వెంకన్న శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తాగునీటి పైప్‌లైన్ పనులతో పాటు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ అనుసంధాన పనులను తనిఖీ చేసి, పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులతో కాకతీయ యూనివర్సిటీ రోడ్డు రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్లైన్ల పురోగతిని కమిషన్ పరిశీలించారు.కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, డీఈ శ్రీకాంత్, ఏఈలు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.