Saturday, September 12, 2026
Home Politics 7వ వార్డు గజవాడ నాగరాజు ఇంటింటి ప్రచారం గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా గజవాడ నాగరాజు

7వ వార్డు గజవాడ నాగరాజు ఇంటింటి ప్రచారం గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా గజవాడ నాగరాజు

0
47

📰 Generate e-Paper Clip

7వ వార్డు గజవాడ నాగరాజు ఇంటింటి ప్రచారం గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా గజవాడ నాగరాజు

{మెదక్ జిల్లా  పరివర్తన ఆవాజ్} మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఏడవ వార్డు పరిధిలోని గొల్లిపర్తి లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణుల రాకతో సందడిగా మారింది. కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజు తన మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి, గ్రామస్తుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, గొల్లిపర్తిని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ​వార్డులో ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, ప్రతి గల్లీలో ఆధునిక మురుగునీటి కాలువలు (Drainage) నిర్మించి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదేవిధంగా, మట్టి రోడ్ల స్థానంలో నాణ్యమైన సి.సి. రోడ్ల నిర్మాణం చేపట్టి రవాణా ఇబ్బందులు తొలగిస్తామని భరోసా ఇచ్చారు.
​ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ, కోటమ్మ గుడి వద్ద జరిగే కోటమ్మ కళ్యాణ మహోత్సవానికి సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నదాన సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే శుభకార్యాల కోసం పెద్దమ్మ గుడి ప్రాంగణంలో అత్యాధునిక మినీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని పేర్కొన్నారు. వార్డులోని ప్రతి వీధిలో నూతన విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపుతామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా (ఇన్సూరెన్స్) కల్పించి కుటుంబాల్లో భరోసా నింపుతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే నిరంతరం అందుబాటు లో ఉండి సేవ చేస్తానని ఆయన కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.