Monday, September 14, 2026
Home Politics రేపు నందా తండాలో ముగ్గుల పోటీలు

రేపు నందా తండాలో ముగ్గుల పోటీలు

0
46
IMG-20251225-WA0977

📰 Generate e-Paper Clip

 


మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్  బలరాం విజ్ఞప్తి

 

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

నందా తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపు ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు సర్పంచ్ మాలోత్ బలరాం తెలిపారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేశారు.

ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడతాయని, ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యమని అన్నారు.

గ్రామ ప్రజలు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని సర్పంచ్ మాలోత్ బలరాం కోరారు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.