రేపు నందా తండాలో ముగ్గుల పోటీలు

  మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్  బలరాం విజ్ఞప్తి   పరివర్తన అవాజ్,కొత్తగూడెం నందా తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపు ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు సర్పంచ్ మాలోత్ బలరాం తెలిపారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేశారు. ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడతాయని, ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యమని అన్నారు....