Monday, September 14, 2026
Home Politics కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్...

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

0
52
images-1

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ లాటరీ పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగినట్లు తెలిపారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులు ఉండగా, వాటిలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు 11 వార్డులు, షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఎస్సీ)కు 12 వార్డులు, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ)కు 7 వార్డులు, సాధారణ మహిళలకు 30 వార్డులు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 14 వార్డులు కేటాయించినట్లు తెలిపారు.

*ఎస్టీ కేటగిరీ:*

ఎస్టీకి కేటాయించిన 11 వార్డుల నెంబర్లు 20, 34, 9, 33, 23, 19, 3, 48, 31, 52, 32గా ఖరారయ్యాయి. ఇందులో ఎస్టీ మహిళలకు 34, 52, 31, 23, 9 వార్డులు, ఎస్టీ జనరల్‌కు 20, 33, 19, 3, 48, 32 వార్డులు కేటాయించారు.

*ఎస్సీ కేటగిరీ:*

ఎస్సీకి మొత్తం 12 వార్డులు రిజర్వ్ చేయగా, వార్డు నెంబర్లు 18, 47, 24, 13, 26, 17, 43, 15, 12, 27, 35, 28గా నిర్ణయించారు. వీటిలో ఎస్సీ మహిళలకు 18, 13, 27, 15, 12, 35 వార్డులు, ఎస్సీ జనరల్‌కు 47, 24, 26, 17, 43, 28 వార్డులు కేటాయించినట్లు తెలిపారు.

*బీసీ కేటగిరీ:*

బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కేటగిరీలో 7 వార్డులు రిజర్వ్ చేయగా, వార్డు నెంబర్లు 46, 59, 21, 60, 30, 55, 53గా ఖరారయ్యాయి. ఇందులో బీసీ మహిళలకు 46, 60, 21 వార్డులు, బీసీ జనరల్‌కు 59, 30, 55, 53 వార్డులు కేటాయించినట్లు తెలిపారు.

*సాధారణ మహిళల కేటగిరీ:*

సాధారణ మహిళలకు మొత్తం 16 వార్డులు రిజర్వ్ చేయగా, వార్డు నెంబర్లు 10,5,11,54,36,7,22,4,56,8,41,37,57,2,1,16 గా నిర్ణయించారు.

*అన్‌రిజర్వ్డ్ కేటగిరీ:*

అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 14 వార్డులు ఉండగా, వార్డు నెంబర్లు 6, 14, 25, 29, 38, 39, 40, 42, 44, 45, 49, 50, 5, 58గా ఖరారైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, 2011 జనాభా ప్రాతిపదికన, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. లాటరీ పద్ధతిలో ఖరారైన ఈ రిజర్వేషన్ల పూర్తి వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.