కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పరివర్తన అవాజ్,కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ లాటరీ పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగినట్లు తెలిపారు.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులు ఉండగా, వాటిలో...