Sunday, September 13, 2026
Home People ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

0
14

📰 Generate e-Paper Clip

ఘనంగా నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

                     

 

రాజేంద్రనగర్ పరివర్తన అవాజ్ నవంబర్ 21, రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకపేట లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలం లో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్థుల కోసం కేటాయించిన స్థలం లో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపటం ఆనందంగా ఉందని తెలియచేశారు. వచ్చే సంవత్సరం ఈ వేడుకలు ఆత్మగౌరవ భవనం లో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ భవన నిర్మాణ దిశగా అడుగులు ముందుకు పడలేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్ నిర్మాణం మొదలుపెడతామని తెలియచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కులస్థుల శక్తిని గుర్తించింది అని అందుకే మనకు ఒక మంత్రి పదవిని మరియు మనకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అని అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియచేశారు. ముదిరాజ్ నాయకులు అందరూ ఒకతాటిపైకి రావాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజ్ సామాజిక అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జగన్మోహన్ ముదిరాజ్ మాజీ ఐఏఎస్, ఉప్పరి నారాయణ ముదిరాజ్ , సొప్పరి శంకర్ ముదిరాజ్ , అందే బాబు ముదిరాజ్ , భీమ్ లక్ష్మణ్ ముదిరాజ్, వినోద్ ముదిరాజ్ , కోట్ల పుష్పలత ముదిరాజ్ , మద్దెల సంతోష్ ముదిరాజ్,నిజ్జన రమేష్ ముదిరాజ్ , గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ , రెడ్డి శ్రీను ముదిరాజ్ , గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ , బొక్క శ్రీను ముదిరాజ్ , తలారి మల్లేష్ ముదిరాజ్ గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ముదిరాజ్ సామాజిక నాయకులు, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు మరియు మత్స్యకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.