Sunday, September 13, 2026
Home People అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపారులకు అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపారులకు అవగాహన

0
14

📰 Generate e-Paper Clip

అగ్ని ప్రమాదాల నివారణపై వ్యాపారులకు అవగాహన

పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు : ఇల్లందు పట్టణంలోని 17, 18 వార్డుల పరిధిలో ఆర్యవైశ్య మహాసభ, అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెహ్రూ చౌక్ కూరగాయల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు డి.ఎస్.పి చంద్ర భాను హాజరై వ్యాపారులు, స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, జాగ్రత్తలపై బేసిక్ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు ఎప్పు

డు, ఎక్కడ, ఎలా సంభవిస్తాయో ఊహించడం కష్టమని, కానీ ముందస్తు జాగ్రత్తలు, సురక్షిత చర్యలతో ప్రాణ నష్టం,ఆస్తి నష్టాన్ని తప్పించుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యాపార స్థావరంలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని, అవి పని చేస్తున్నాయో లేదో సమయానుకూలంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో వెంటనే అంబులెన్స్, ఫైర్, పోలీస్ శాఖలకు సమాచారం చేరవేయడం అత్యంత కీలకమని చెప్పారు.
అనంతరం అగ్నిమాపక శాఖ అధికా

రులు ప్రత్యక్ష డెమో నిర్వహించి అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాథమిక నియంత్రణ పద్ధతులపై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ రకాల అగ్నిప్రమాదాలకు ఏ పరికరాలు ఉపయోగించాలి, వాటి వినియోగం ఎలా ఉండాలి, ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలి అనే అంశాలపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు ఎస్‌ఎఫ్‌ఓ జి. రామారావు, టి. నాగరాజు, బి. అఖిల్, ఎం. శివకుమార్, మల్సూర్, ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, నరేంద్రుల అను, తాటిపల్లి సుబ్బారావు, పల్లెర్ల చంద్రశేఖర్, నారాయణదాసు లాహుటి, చందా భద్రం, మనోహర్ తివారి, తాటిపల్లి లక్ష్మణరావు, సైఫా శ్రీనివాస్, సైఫా రాజు, గందే సురేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.