Monday, September 14, 2026
Home People అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి.

0
17

📰 Generate e-Paper Clip

అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి.

కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 21,  మెదక్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాల నుండి మరియు మెదక్ మండలం సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి గత నెల రోజులుగా రాత్రిపగలు హిటాచి సహాయంతో టిప్పర్ల ద్వారా హైదరాబాదు, జహీరాబాద్,బీదర్ నగరాలకు ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు,వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి ,మెదక్ పట్టణ , మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూఅధికార పార్టీ నాయకుల అండదండలతో మెదక్ ప్రాంతం నుండి హైదరాబాద్, జహీరాబాద్ బీదర్ నగరాలకు సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి హిటాచి సహాయంతో గత నెల రోజులగా టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. పోలీసులు పాత కలెక్టర్ ఆఫీస్ వద్ద సామాన్య ప్రజల బండ్లను ఆపి చెక్ చేస్తున్నారు కానీ టిప్పర్లలో ఇసుక వెళ్తుంటే చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అన్నారు . ప్రతిపక్ష నాయకుల పైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కానీ ఈ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దొరకని ఇసుక అక్రమంగా హైదరాబాద్కు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అక్రమంగా ఇసుక దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, లేనిచో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మెదక్ నుండి ఇలా అక్రమంగా ఇసుక తరలిపోతే మెదక్ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో వెంటనే మెదక్ ఎస్పీ ,కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విశ్వం, భీమరి.కిషోర్ ఆర్కే.శ్రీనివాస్, మాయ.మల్లేశం, మెదక్ మండల మాజీ వైస్ ఎంపీపీ మార్గం. ఆంజనేయులు, నాయకులు కొత్తపల్లి కిష్టయ్య,గట్టయ్య, యాదగిరి, లింగా రెడ్డి, ప్రభాకర్, జుబెర్ అహ్మద్, మేకల సాయిలు,యామి రెడ్డి,సాప. సాయిలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.