Friday, September 11, 2026
Home Uncategorized మైనర్ బాలికలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తున్న భరోసా ఎస్సై సుచిత.

మైనర్ బాలికలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తున్న భరోసా ఎస్సై సుచిత.

0
10

📰 Generate e-Paper Clip

మైనర్ బాలికలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తున్న భరోసా ఎస్సై సుచిత.

పరివర్తన ఆవాజ్.  అక్టోబర్ 14  ;     మైనర్ బాలిక పై అత్యాచారం లైంగిక వేధింపులు వంటివి చేసినట్లయితే వారిపై పోక్సో చట్టం ద్వారా చర్య తీసుకోబడుతుందనీ, ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మూడు సంవత్సరాల నుండి జీవితకాలం శిక్ష విధించవచ్చని ఒక లక్ష వరకు జరిమానాను విధించబడుతుందని అన్నారు. భరోసా కేంద్రాలు మన తెలంగాణలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఉంటుందని ఈ భరోసా సెంటర్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఆ బాధితులకు న్యాయం చేస్తామని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ మండలంలోని ముత్తాయి కోట మద్దుల్వాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరానికి హాజరైన భరోసా కేంద్రం ఎస్సై సుచిత గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం లీగల్ అడ్వైజర్ శ్వేత గారు మాట్లాడుతూ ఫోక్సో చట్టం 16 సంవత్సరాలు లోపు కలిగిన అమ్మాయిల గానీ అబ్బాయిలకు వర్తిస్తుందని అలాంటి వారిని సెక్సువల్ గా అబూ చేసిన, వేధించిన వారిపై ఈ ఫోక్సో చట్టం ద్వారా శిక్ష విధించబడుతుందని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం చర్య తీసుకున్నట్లయితే మూడు నుంచి జీవితకాలం పాటు శిక్ష పడే అవకాశం ఉందని కొన్నిసార్లు శిక్షతో పాటుగా లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుందని అన్నారు. మైనర్ బాలికలను వేధించడమే కాకుండా 16 సంవత్సరాల లోపు పిల్లల యొక్క పోర్నోగ్రఫీ వీడియోలను చూసిన, వాటిని ఇతరులకు షేర్ చేసిన ,తమ మొబైల్ లో దాచిపెట్టిన ఈ ఫోక్సో చట్టం ప్రకారం శిక్ష అర్హులు అవుతారని పేర్కొన్నారు. చైల్డ్ మ్యారేజ్ చేసే తల్లిదండ్రులకు మరియు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి కూడా ఫోక్సో చట్టం ప్రకారం చర్య తీసుకోబడుతుందని, కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం యన్ ఎస్ ఎస్ వాలంటీర్లుగా తమ వంతు కర్తవ్యం గా యువత కు , గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం కోఆర్డినేటర్ సౌమ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ మురళి వర్ధెల్లి, వాలంటీర్లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.