Friday, September 11, 2026
Home Uncategorized తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్...

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

0
13

📰 Generate e-Paper Clip

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పరివర్తన అవాజ్ అక్టోబర్ 21 ,   తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని అన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.