Friday, September 11, 2026
Home Uncategorized ఘునాథపల్లిలో వనిత టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఘునాథపల్లిలో వనిత టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

0
15

📰 Generate e-Paper Clip

ఘునాథపల్లిలో వనిత టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హన్మకొండ జిల్లా ప్రతినిది అక్టోబర్ 22 (పరివర్తన అవాజ్), రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం అదే ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామజికంగా ఎదగాలని మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ సకాలంలో బిల్లులు అందేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డివో, తహసీల్దార్, ఎంపిడివో, డిఆర్ డివో, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.