Friday, September 11, 2026
Home Uncategorized   కామారెడ్డి జిల్లా పోలీసుల సూపర్ రికార్డ్: ప్రతి నెల 150కు పైగా మొబైల్...

  కామారెడ్డి జిల్లా పోలీసుల సూపర్ రికార్డ్: ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ

0
16

📰 Generate e-Paper Clip

          కామారెడ్డి జిల్లా పోలీసుల సూపర్ రికార్డ్: ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ

• ప్రతి నెల 150 కు పైగా ఫోన్స్ రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు .
• ఈ సంవత్సరం రూ. 2 కోట్ల 53 లక్షల విలువైన 1579 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించాము
• స్పెషల్ డ్రైవ్ ద్వారా 164 (మొత్తం విలువ సుమారు ₹27 లక్షలు) పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.
• మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.
• బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు.,

 సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదు – CEIR ద్వారా తిరిగి పొందవచ్చు అని జిల్లా పోలీస్ అధికారి శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…..
 
మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైనదని, అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కూడా కోల్పోతున్నారు అని ఆయన అన్నారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని, అలాగే సిమ్ కార్డ్ ను బ్లాక్ చేసి అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. అనంతరం CEIR వెబ్‌సైట్‌లో IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్‌ను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ  వివరించారు.
 
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో RSI శ్రీ బాలరాజు మరియు 6 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ సంవత్సరం ఎనిమిదో దఫాగా గత 15 రోజుల్లో ఈ బృందం 164 మొబైల్ ఫోన్లను రికవరీ చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 1,579 మొబైల్ ఫోన్లు, సుమారు ₹2.53 కోట్ల విలువగలవి, బాధితులకు అందజేశాం అని ఎస్పీ  అన్నారు. CEIR పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,026 మొబైల్ ఫోన్లు (₹6.45 కోట్ల విలువగలవి) రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా 164 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ  అభినందించడం జరిగింది. 
ఇప్పటి వరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు బాధితులకు తెలియజేయబడతాయి. వారు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి RSI శ్రీ బాలరాజు (ఫోన్: 8712686114) గారిని సంప్రదించి సంబంధిత వివరాలు చూపించి తమ మొబైల్ ఫోన్లను స్వీకరించవచ్చు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.