Thursday, November 26, 2026
Home People గాయపడిన మున్సిపల్ కార్మికులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

గాయపడిన మున్సిపల్ కార్మికులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ : జిల్లా కేంద్రంలోని సందీప్ డిగ్రీ కళాశాల సమీపంలో నవంబర్ 24న మున్సిపల్ కార్మికులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. వారిలో కొందరికి ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, ఇతర పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కార్మికుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫ్రాక్చర్లు అయిన కార్మికులకు వెంటనే ఆపరేషన్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే కార్మికులు పూర్తిగా కోలుకునే వరకు వారికి హాజరు నమోదు చేసి పూర్తి వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్, చైర్మన్‌లను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాసుల లక్ష్మీనారాయణ, పుల్లూరి సతీష్, మజీద్, తూర్పు ప్రభాకర్, వడ్డే నర్సింలు, సాయి సంగమేశ్వర్, నరేష్, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.