Friday, November 27, 2026
Home People మచాలే బాబాకు ఘన సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

మచాలే బాబాకు ఘన సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

0
15

📰 Generate e-Paper Clip

లింగంపల్లి పరివర్తన అవాజ్ : జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలోని శ్రీకృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా ఆల్ ఇండియా మహానుభావల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మచాలే బాబాకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మచాలే బాబా ఆధ్యాత్మిక రంగంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ధర్మం, ఆధ్యాత్మికతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారని అన్నారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేలా అవగాహన కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో పాటు ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పీటీసీలు పడిగెల రాజేశ్వరరావు, కమ్లి నరసింహులు, మాజీ ఎంపీపీ రమేష్, చందాపూర్, దేమేకలాన్ సర్పంచులు మంగారెడ్డి, రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణాజీరావు, స్థానిక మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగోల్, తాడువాయి మండల కన్వీనర్ నరసింహులు, లింగంపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రావు, సారంగు బాబా, మోహన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.