మచాలే బాబాకు ఘన సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
లింగంపల్లి పరివర్తన అవాజ్ : జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలోని శ్రీకృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా ఆల్ ఇండియా మహానుభావల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మచాలే బాబాకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మచాలే బాబా ఆధ్యాత్మిక రంగంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ధర్మం, ఆధ్యాత్మికతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన విశేష...