Thursday, November 26, 2026
Home People దీక్షా దివస్ స్ఫూర్తి సభలను ఘనంగా నిర్వహించాలి

దీక్షా దివస్ స్ఫూర్తి సభలను ఘనంగా నిర్వహించాలి

0
9

📰 Generate e-Paper Clip

కామారెడ్డి పరివర్తన అవాజ్; తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ స్ఫూర్తి సభలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.2009లో కేసీఆర్ చేపట్టిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన ప్రకటన వంటి చారిత్రక పరిణామాలను నేటి యువతకు వివరించాలని సూచించారు.ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి మందితో సభలు నిర్వహించాలని, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, జేఏసీ నాయకులు, కవులు, రచయితలను సత్కరించాలని పేర్కొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో అలుగునూరులో భారీ స్థాయిలో ప్రత్యేక స్ఫూర్తి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల స్వామి గౌడ్, సీనియర్ నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ కుంభాల రవి యాదవ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి బలవంతరావు, మాజీ కౌన్సిలర్ కృష్ణాజీరావు, యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, పాత హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.