దీక్షా దివస్ స్ఫూర్తి సభలను ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి పరివర్తన అవాజ్; తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ స్ఫూర్తి సభలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.2009లో కేసీఆర్ చేపట్టిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన ప్రకటన వంటి చారిత్రక పరిణామాలను నేటి యువతకు వివరించాలని సూచించారు.ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి మందితో సభలు నిర్వహించాలని, తెలంగాణ...